యు.ఏ.ఈ లో శుక్రవారంతో ముగియనున్న లేబర్ మిడ్ డే బ్రేక్
- September 14, 2017
యు.ఏ.ఈ:మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్, జూన్ 15న ప్రారంభమైన మిడ్ డే బ్యాన్ సెప్టెంబర్ 15తో ముగియనుందని ప్రకటించింది. ఇన్‌స్పెక్షనల్ ఎఫైర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ మెహర్ అల్ ఒబెద్ మాట్లాడుతూ, మిడ్ డే బ్రేక్ రూల్‌ని పాటించినవారందరికీ అభినందనలు తెలిపారు. 13 ఏళ్ళుగా ఈ మిడ్ డే వర్క్ బ్యాన్ అమల్లో ఉంటోంది. తీవ్రమైన వేసవి తాపం కారణంగా, మధ్యాహ్న సమయాల్లో ఎండలో పనిచేసేవారికి తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్న దరిమిలా మిడ్ డే బ్యాన్‌ని తెరపైకి తెచ్చారు. మిడ్ డే బ్యాన్ సందర్భంగా నిర్దేశిత పని గంటల్లో మాత్రమే ఔట్ డోర్‌లో కార్మికులతో పని చేయించాల్సి ఉంటుంది. అలాగే కార్మికులకు తగిన సౌకర్యాల్నీ కల్పించాల్సిన బాధ్యత ఆయా సంస్థలపై ఉంటుంది. మిడ్ డే బ్యాన్ ముగిసిన తర్వాత యధాతథంగా పని గంటలు ఉంటాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







