ఏపీలో ఐటీ రంగానికి పెద్ద పీట వేస్తున్నాం- మంత్రి లోకేష్
- September 15, 2017
సైబర్ సెక్యూరిటీకి ఏపీని కేంద్రంగా చేయాలనే లక్యంతో పనిచేస్తున్నట్టు ఐటీ మంత్రి లోకేష్ తెలిపారు. టెక్నాలజీతో ప్రజలకు సేవలందించాలని ప్రయత్నిస్తున్నామన్నారు. విభజన తర్వాత ఏపీలో ఐటీ రంగం చాలా తక్కువగా ఉండేదన్న లోకేష్.. తమ ప్రభుత్వం సాఫ్ట్ వేర్ రంగానికి పెద్దపీట వేసిందన్నారు. పరిపాలన అంతా టెక్నాలజీ ఆధారంగా జరుగుతుండడంతో హ్యాకింగ్ బెడద లేకుండా ఎలా ఉపయోగించాలనే అంశంపై ఆలోచిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే విశాఖలో అక్టోబర్ 9, 10 తేదీల్లో అంతర్జాతీయ టెక్ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారని మంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









