కతార్, దోహాలోని కొర్నీచే వీధుల్లో కొత్త కూడల్ల ప్రారంభం

- October 30, 2015 , by Maagulf
కతార్, దోహాలోని కొర్నీచే వీధుల్లో కొత్త కూడల్ల ప్రారంభం

కతార్, దోహాలోని కొర్నీచే వీధుల్లో కొత్త కూడల్ల ప్రారంభం దోహాలోని కొర్నీచే వీధుల్లో ఎమిరీ దివాన్ మరియు నేషనల్ ధియేటర్ మధ్య కొత్తగా నిర్మితమైన సిగ్నల్- కంట్రోల్ కూడల్లను నిన్న ప్రారంభించారు. ఈ కొత్త కూడల్ల వలన అల్ దివాన్ కూడలి నుండి నేషనల్ థియేటర్ కూడలికి పోయే బాటసారులు, అల్ రుమాలియా వీధి లోకి లెఫ్ట్-హాండ్ టర్న్ తీసుకోవడానికి లేదా నేషనల్ ధియేటర్ కూడలి వరకు వెళ్ళి యూ -టర్న్ తీసుకొనవసరం లేకుండా అల్ కోర్నీచే వీధికి ఎదురుగా గల వీధిలోకి యూ-టర్న్ తీసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది.అస్ఘల్ యొక్క కార్యకలాపాలు మరియు నిర్వహణ విభాగం, ఈ కూడలి పనులను నిర్దేశిత సమయం కంటే ముందుగా అంటే ఐదు వారాల పరిధిలోగానే పూర్తిచేసి ప్రారంభించారు. ఈ కూడళ్ల వలన నేషనల్ ధియేటర్ కూడలిలో ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గించగలిగామని వారు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com