ముంబై ఆర్ కే స్టూడియో లో భారీ అగ్ని ప్రమాదం
- September 16, 2017
మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని ఆర్కే సినిమా స్టూడియోలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకటో నంబర్ హాల్ పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. విద్యుదాఘాతంతోనే ప్రమాదం సంభవించినట్లు గుర్తించారు. స్టుడియోలో కొద్దిరోజులుగా విద్యుద్దీకరణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం కార్మికులు పనులు చేస్తున్న సమయంలో షార్ట్‌సర్క్యూట్ సంభవించి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ వూపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోని టీవీ షో 'సూపర్ డ్యాన్సర్' సెట్ ఉంది. ఈరోజు శనివారం కావడంతో సెట్ ఖాళీగా ఉంది. దీంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. ఈ స్టుడియోను బాలీవుడ్ ప్రఖ్యాత నటుడు రాజ్‌కపూర్ 1948లో స్థాపించారు. ప్రస్తుతం దాని నిర్వహణ బాధ్యతలను ఆయన కుమారుడు రిషి కపూర్ చూస్తున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







