ముంబై ఆర్ కే స్టూడియో లో భారీ అగ్ని ప్రమాదం

- September 16, 2017 , by Maagulf
ముంబై ఆర్ కే స్టూడియో లో భారీ అగ్ని ప్రమాదం

మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని ఆర్కే సినిమా స్టూడియోలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకటో నంబర్‌ హాల్‌ పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. విద్యుదాఘాతంతోనే ప్రమాదం సంభవించినట్లు గుర్తించారు. స్టుడియోలో కొద్దిరోజులుగా విద్యుద్దీకరణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం కార్మికులు పనులు చేస్తున్న సమయంలో షార్ట్‌సర్క్యూట్‌ సంభవించి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ వూపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోని టీవీ షో 'సూపర్‌ డ్యాన్సర్‌' సెట్‌ ఉంది. ఈరోజు శనివారం కావడంతో సెట్‌ ఖాళీగా ఉంది. దీంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. ఈ స్టుడియోను బాలీవుడ్‌ ప్రఖ్యాత నటుడు రాజ్‌కపూర్‌ 1948లో స్థాపించారు. ప్రస్తుతం దాని నిర్వహణ బాధ్యతలను ఆయన కుమారుడు రిషి కపూర్‌ చూస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com