'సైంటిస్ట్' రానా

- September 16, 2017 , by Maagulf
'సైంటిస్ట్' రానా

బాహుబలి చిత్రం తో జాతీయ స్థాయి లో గుర్తింపు పొందిన దగ్గుపాటి రానా..తాజాగా హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెల్సిందే. లండన్ కు చెందిన ప్రొడక్షన్ హౌస్ నిర్మించబోయే చిత్రం ద్వారా రానా హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రానికి విజిల్ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఇది ఓ పెద్ద ఓడ నేపథ్యంలో సాగే కథ.. కాగా ఈ మూవీ లో సైంటిస్ట్ రోల్ లో రానా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

విజిల్ ఓడ 1888 లో అదృశ్యమైంది. 700 మంది ప్యాసింజర్లతో సౌరాష్ట్ర నుంచి బయలు దేరిన ఈ ఓడ కనిపించకుండా పోయింది. ఆ ఓడ అదృశ్యం కావడానికి కారణాలేంటి అని పరిశోధించి సైంటిస్ట్ పాత్రలో రానా కనిపించబోతున్నాడు. ఈ మూవీ 2018 లో సెట్స్ ఫైకి వెళ్లనుంది. తాజాగా రానా నేనే రాజు నేనే మంత్రి మూవీ తో ప్రేక్షకుల ను అలరించాడు. సెప్టెంబర్‌ 22న తమిళంలో 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రం 'నాన్‌ అనైయిట్టల్‌' పేరిట విడుదల కాబోతోంది. ప్రస్తుతం రానా తమిళం లో చిత్ర ప్రమోషన్ లలో బిజీ బిజీ గా ఉన్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com