'సైరా'లో సునీల్.!
- September 16, 2017
హీరోగా మారిన తరువాత సునీల్‌కి ఈ మధ్య సక్సెస్ లేకుండాపోయింది. సునీల్ రీసెంట్ రిలీజ్ 'ఉంగరాల రాంబాబు' కూడా ఫ్లాప్ జాబితాలోకి చేరిపోయింది. దాంతో హీరోగా సునీల్ మార్కెట్ కూడా అమాంతం తగ్గింది. వరుసగా ఫ్లాప్స్ పలకరించడంతో సునీల్ ఇక నుండి కమెడియన్‌గా కూడా చేయాలని డిసైడ్ అయ్యాడట. దాంతో సునీల్ మళ్ళీ కమెడియన్‌గా బిజీ కావడం పక్కా అనే టాక్ వినిపిస్తోంది.
ఇక మెగాస్టార్ చిరంజీవి చారిత్రాత్మక చిత్రం 'సైరా'లో సునీల్ నటించబోతున్నాడనేది లేటెస్ట్ న్యూస్. ఐతే.. ఎమోషనల్‌గా సాగే 'సైరా'లో సునీల్ చేస్తోంది కమెడియన్ రోలేనా..? అనేది తెలియాల్సి వుంది. తరువాత తన ఫ్రెండ్ త్రివిక్రమ్ డైరెక్షన్లో కూడా సునీల్ కమెడియన్‌గానే కనిపించబోతున్నట్లు సమాచారం. మరోవైపు.. సునీల్ కథానాయకుడిగా చేస్తోన్న 'టు స్టేట్స్' రిలీజ్‌కి రెడీ అవుతోంది.
తాజా వార్తలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్‌పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!









