22న రాబోతున్న కొంచెం కొంచెం సినిమా
- September 17, 2017
కాలం కొంచెంకొంచెం మారుతూ వస్తోంది. దాని తో సమాజంలో జరుగుతున్న మార్పులు మాత్రం చాలానే. అయి తే ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు. అన్నీ దాటి పోతాయి అనే చక్కని సందేశంతో కూడిన జనరంజక చిత్రంగా కొంచెం కొంచెం చిత్రం ఉంటుందని ఈ చిత్ర దర్శకుడు ఉదయశంకర్ అంటున్నారు. ఆయన ప్రముఖ మలయాళ దర్శకుడు లోహితాదాస్ శిష్యుడు అన్నది గమనార్హం. మలయాళంలో 20కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఉదయశంకర్ తమిళ ప్రేక్షకులు ప్రతిభకు, నవ్యతకు పట్టం కడతారనే నమ్మకంతో చేసిన తమిళ చిత్రం ఇదని పేర్కొన్నారు.
తన అక్కల కోసం తమ్ముడు ఎలాంటి త్యాగం చేశా డు? దాని పర్యావసానం ఏమిటీ లాంటి పలు ఆసక్తికరమైన సం ఘటనలతో ప్రేమ, పాశం, వినోదం వంటి జనరంజక అంశాలతో కూడిన చిత్రంగా కొంచెం కొంచెం ఉంటుందని ఆయన తెలిపారు. గోకుల్ హీరోగానూ నీణు హీరోయిన్‌గానూ నటించిన ఇందులో అప్పుకుట్టి ప్రధాన పాత్రను పోషించారు. ఇతర ముఖ్య పాత్రల్లో ప్రియామోహన్, మన్సూర్ అలీఖాన్, మధుమిత, తవసీ, శివథా ను నటించారు. ఆర్.విక్కీకన్నన్ ఛాయాగ్రహణం, వల్లవన్ సంగీ తాన్ని అందించిన ఈ చిత్రాన్ని మిమోచర్ ప్రొడక్షన్స్ పతాకంపై సీకే.ఆర్.మోహన్ నిర్మిస్తున్నారు. చిత్ర షూటింగ్‌ను పొల్లాచ్చి, తేని, కేరళ ప్రాంతాల్లో 36 రోజుల్లో నిర్వహించి పూర్తి చేసినట్లు దర్శకుడు తెలిపారు. కొంచెం కొంచెం చిత్రాన్ని ఈ నెల 22వ తేదీన విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







