నా హీరోని కలవడానికి 33 ఏళ్ల పట్టింది
- September 18, 2017
ఖుష్బూ... సౌతిండియా చిత్ర పరిశ్రమకు పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు అగ్ర కథానాయికగా వెలుగొందింది. ఆమెకు అభిమానుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమిళనాడు రాష్ట్రంలో ఒకానొక సమయంలో ఆమెకు అభిమానులు గుడి కూడా కట్టారు.
1
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఖుష్బూ
ప్రస్తుతం ఖుష్బూ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అయితే ఆమె ఓ వ్యక్తిని కలవడానికి 33 ఏళ్లు నిరీక్షించిందంట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇంతకీ ఎవరా వ్యక్తి అని అనుకుంటున్నారా? టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి.
2
రవిశాస్త్రితో సెల్ఫీ
సోమవారం తన చిన్ననాటి అభిమాన క్రికెటర్, ప్రస్తుత టీమ్ ఇండియా కోచ్ రవిశాస్త్రితో కలిసి తీసుకున్న సెల్ఫీలను ట్విటర్‌లో పెట్టింది. 'నా కల నిజమైంది. చివరికి నా హీరో రవిశాస్త్రిని కలుసుకున్నా. నిరీక్షణ ఫలించింది. ఆయన్ని కలవడానికి 33 ఏళ్లు ఎదురుచూశా' అని ఖుష్బూ ట్వీట్ చేసింది.
3
అభిమానుల కోసం సోషల్ మీడియాలో
అంతేకాదు ఈ సందర్భంగా రవిశాస్త్రితో కలిసి దిగిన ఫొటోలను అభిమానుల కోసం సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇదిలా ఉంటే ఖుష్బూ ప్రస్తుతం పవర్‌స్టార్ కళ్యాణ్ 25వ చిత్రంలో నటిస్తున్నారు. 2006లో 'స్టాలిన్' తర్వాత ఆమె తెలుగులో నటిస్తున్న చిత్రం ఇదే.
4
పవన్ కళ్యాణ్‌కు అత్త పాత్రలో
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తిసురేశ్, అను ఇమ్మాన్యుయెల్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో ఖుష్బు.. పవన్ కళ్యాణ్ అత్త పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ఒకటి బయటకు వచ్చింది.
తాజా వార్తలు
- దుబాయ్–టెల్ అవీవ్ ఫ్లై దుబాయ్ విమానంలో ఘటన
- భారత్–ఖతార్ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- పోలీసింగ్‌లో నాయకత్వం ఎంతో కీలకం: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్
- సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: సీఎం రేవంత్
- గ్రీన్ ఎనర్జీ కోసం కేంద్రం కొత్త పథకం
- షార్జాలో 58వ వాచ్ అండ్ జ్యువెలరీ మిడిల్ ఈస్ట్ షో ప్రారంభం
- దుబాయ్‌లో తొలి ఎతిహాద్ రైల్ స్టేషన్ ప్రారంభం
- హైదరాబాద్ విమానాశ్రయంలో DRI భారీ ఆపరేషన్
- అక్టోబర్ 2 నుంచి ‘సేవ్ డెమొక్రసీ మార్చ్’.. ఇండియా కూటమి కీలక నిర్ణయం
- నమో భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..







