ప్రపంచంలోనే అత్యధిక వేగంతో ప్రయాణించే బుల్లెట్ రైలును చైనాలో ప్రారంభం
- September 21, 2017
ప్రపంచంలోనే అత్యధిక వేగంతో ప్రయాణించే బుల్లెట్ రైలును చైనా గురువారం ప్రారంభించింది. ఫ్యుక్సింగ్ గా పిలిచే ఈ రైలు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది బీజింగ్- షాంఘై నగరాల మధ్య రాకపోకలు సాగించనుంది. ఈ బుల్లెట్ రైలు రాకతో రెండు నగరాల మధ్య ప్రయాణ దూరం 4 గంటల 28 నిమిషాల మేర తగ్గనుంది. ఈ మార్గంలో రోజూ 5,05,000 మంది ప్రయాణిస్తుంటారు. దీంతో ఈ సర్వీసు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు.
2008లో బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టిన చైనా 2011లో వాటి వేగాన్ని గణనీయంగా తగ్గించింది. ఆ ఏడాది రెండు బుల్లెట్ రైళ్లు ఢీకొన్న ఘటనలో 40 మంది చనిపోగా. 190 మంది గాయపడ్డారు. అతివేగం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించిన అధికారులు వాటి వేగాన్ని నియంత్రించారు. మళ్లీ ఆరేళ్ల తర్వాత అత్యధిక వేగంతో నడిచే రైలును పునఃప్రారంభించారు. ప్రస్తుత రైలు గంటలకు అత్యధికంగా 400 కి.మీల వేగంతో ప్రయాణించే వీలున్నా, 350 కి.మీలకే పరిమితం చేశారు. ఈ వేగంతో ప్రయాణిస్తే 10శాతం విద్యుత్ ఆదా అవుతుంది.
అత్యాధునిక ఫీచర్లతో రూపొందించిన ఈ రైలులో భద్రతకు పెద్దపీట వేశారు. ప్రయాణిస్తున్న సమయంలో ఏదైనా విపత్తు ఎదురైతే రైలు దానికదే వేగాన్ని తగ్గించుకోగలదు. రిమోట్ డేటా ట్రాన్స్మిషన్ సిస్టమ్‌తో కూడిన ఈ రైలులోని అన్ని బోగీల్లో వైఫై, మొబైళ్ల ఛార్జింగ్ పోర్టులు ఉంచారు. చైనాలో ప్రస్తుతం 20వేల కిలోమీటర్ల మేర బుల్లెట్ రైలు వ్యవస్థ ఉండగా.. 2020 నాటికి మరో 10వేల కిలోమీటర్ల మేర విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







