హైదరాబాద్‌లో కైలాష్ సత్యార్థి యాత్రకు భారీ స్పందన
- September 21, 2017
బాలల అక్రమ రవాణాపై కదం తొక్కుతున్నారు కైలాష్ సత్యార్థి. బాలికలపై లైంగిక వేధింపులు అరికట్టాలంటూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. నెల రోజుల పాటు భారత యాత్ర చేపట్టి ఊరూ-వాడా ప్రచారం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో కైలాష్ యాత్రకు భారీ స్పందన వచ్చింది. కొత్త రాష్ట్రమైన తెలంగాణ.. సురక్షిత రాష్ట్రంగా మారాలని కాంక్షించారు.
బాలికలు, మహిళలు, పిల్లల అక్రమ రవాణా, వేధింపులకు వ్యతిరేకంగా నోబెల్ ప్రైజ్ గ్రహీత కైలాష్ సత్యార్థి పోరుబాట. సెప్టెంబర్ 11 నుంచి ఆయన చేస్తున్న దేశ పర్యటన హైదరాబాద్‌కు చేరుకుంది. భారత్ యాత్రకు అనూహ్య స్పందన లభించింది. వివిధ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి.. యాత్రలో పాల్గొన్నారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, అమల తదితరులు ర్యాలీకి హాజరయ్యారు. ర్యాలీ అనంతరం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ జరిగింది. బాలలు, మహిళల అక్రమ రవాణాపై యుద్ధం ప్రకటించాలని.. సురక్ష భారతం కోసం అందరూ కృషి చేయాలని పిలుపిచ్చారు కైలాష్ సత్యార్థి. అక్రమ రవాణా వ్యతిరేక బిల్‌ను పార్లమెంట్ త్వరగా పాస్ చేయాలని ఎంపీలను కోరారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ.. సేఫ్ తెలంగాణగా మారాలని అభిలషించారు.కైలాష్ సత్యార్థి చేపట్టిన భారత్ యాత్ర అక్టోబర్ 16 వరకూ కొనసాగనుంది.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







