మల్టిపుల్‌ స్లెరోసిస్‌కి సరికొత్త ట్రీట్‌మెంట్‌

- September 22, 2017 , by Maagulf
మల్టిపుల్‌ స్లెరోసిస్‌కి సరికొత్త ట్రీట్‌మెంట్‌

మనామా: బహ్రెయిన్‌లో మెడికల్‌ రీసెర్చర్స్‌ టీమ్‌ ఒకటి, మల్టిపుల్‌ స్లెరోసిస్‌ చికిత్స కోసం సరికొత్త విధానాన్ని కనుగొంది. ప్రిన్సెస్‌ అల్‌ జవహారా సెంటర్‌ ఫర్‌ మాలెక్యులర్‌ మెడిసిన్‌, ఇన్‌హెరిటెడ్‌ డిజార్టర్స్‌కి చెందిన రీసెర్చర్స్‌ వెల్లడిస్తున్న వివరాల ప్రకారం, తాము కనుగొన్న కొత్త విధానం ద్వారా ఆటో ఇమ్యూన్‌ డిసీజ్‌కి చికిత్స సులభతరమవుతుందనీ, మంచి ఫలితాలు ఉంటాయని తెలుస్తోంది. సాధారణ వ్యక్తులతో పోల్చితే, మల్టిపుల్‌ స్లెరోసిస్‌ వ్యాధిగ్రస్తుల్లో ఐదు రకాల జీన్స్‌ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని పరిశోధనా బృందం తెలిపింది. సెంట్రల్‌ నెర్వస్‌ సిస్టమ్‌కి సంబంధించిన సమస్య మల్టిపుల్‌ స్లెరోసిస్‌. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్‌ రీజియన్‌లో ఈ వ్యాధితో చాలా ఎక్కువమంది బాధపడుతున్నారు. కొత్తగా కనుగొన్న విధానంలో వ్యాధిగ్రస్తులకు చికిత్స సులభవంతమవడం ద్వారా మెరుగైన ఫలితాలు ఈ విభాగంలో సాధించవచ్చునని రీసెర్చర్స్‌ అంచనా వేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com