'ఆక్సిజన్' ఒక ప్రత్యేకమైన సినిమా
- September 22, 2017
గోపీచంద్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'ఆక్సిజన్'. రాశీ ఖన్నా, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. ఎ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నారు. అక్టోబరు 27న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ''గోపీచంద్ కెరీర్లోనే ఓ ప్రత్యేకమైన చిత్రమిది. అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందించాం. ముంబై, గోవా, సిక్కిం, చెన్నై తదితర ప్రాంతాల్లో రాజీ పడకుండా చిత్రీకరణ జరిపాం. గోపీచంద్ ఒక తపనతో పనిచేశారు. జగపతిబాబు పాత్ర కీలకం. యువన్ శంకర్ రాజా సంగీత సారథ్యంలో సిద్ధం చేసిన పాటల్ని అక్టోబరు మొదటివారంలో విడుదల చేస్తాం'' అన్నారు. కిక్శ్యామ్, అలీ, చంద్రమోహన్, నాగినీడు, బ్రహ్మాజీ, అభిమన్యుసింగ్, అమిత్, ప్రభాకర్, సాయాజీషిండే, ఆశిష్ విద్యార్థి, వెన్నెల కిషోర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి పోరాటాలు: పీటర్హెయిన్స్, స్టంట్ సిల్వ.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







