గ్యాంబ్లింగ్‌: దుబాయ్‌లో 12 మంది అరెస్ట్‌

- September 22, 2017 , by Maagulf
గ్యాంబ్లింగ్‌: దుబాయ్‌లో 12 మంది అరెస్ట్‌


 చైనాకి చెందిన 12 మంది గ్యాంబ్లింగ్‌ డెన్‌ నిర్వహిస్తూ పట్టుబడ్డారు. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. నైఫ్‌లోని ఓ ఫ్లాట్‌ని డెన్‌గా ఏర్పాటు చేసుకుని, ఇక్కడ గ్యాంబ్లింగ్‌ నిర్వహిస్తున్నారు. డ్రగ్స్‌కి సంబంధించి తొలుత సమాచారం అందిందనీ, ఆ సమాచారంతో తనిఖీలు నిర్వహించగా గ్యాంబ్లింగ్‌ బయటపడిందని యాంటీ నార్కోటిక్స్‌ వర్గాలు వెల్లడించాయి. జూన్‌ 15న తెల్లవారు ఝామున 2 గంటల సమయంలో యాంటీ నార్కోటిక్స్‌ డివిజన్‌కి చెందిన అధికారులు రెయిడ్‌ నిర్వహించారు. వీరిని ప్రాసిక్యూషన్‌కి రిఫర్‌ చేయడం జరిగింది. కోర్ట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ ఇన్‌స్టాన్స్‌లో వీరిపై కేసులు నమోదయ్యాయి. వివిధ దేశాలకు చెందిన కరెన్సీని కూడా నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు అధికారులు. జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ నార్కోటిక్స్‌, నిందితుల నుంచి మూత్ర నమూనాల్ని సేకరించగా, అ ఫలితాలు నెగెటివ్‌గా తేలాయి. అనంతరం వీరిపై గ్యాంబ్లింగ్‌ సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com