స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' సినిమా షూటింగ్ ఊటి లో

- September 22, 2017 , by Maagulf
స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్ 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' సినిమా షూటింగ్ ఊటి లో

స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్, అనుఇమ్మాన్యూయేల్ లు జంట‌గా, వ‌క్కంతం వంశి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా”.  ఇటీవ‌లే హైద‌రాబాద్ షెడ్యూల్ పూర్తిచేసుకుని ప్ర‌స్తుతం ఊటీ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రాన్ని కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా  నిర్మిస్తున్నారు.  “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా”  పేరు ఎనౌన్స్ చేసిన ద‌గ్గ‌ర‌నుండి అంద‌రిలో ఓ ఆశ‌క్తి నెల‌కొంది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త చిత్రాలు చేస్తూ ప్రేక్ష‌కుల అభిమానాన్ని అనూహ్యంగా పొందిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నుంచి మ‌రో కొత్త చిత్ర రానుంద‌ని తెలుగు ప్రేక్ష‌కుల ఆశిస్తున్నారు. అయితే వారి అంచ‌నాలు ఏమాత్రం త‌గ్గ‌కుండా ఈ చిత్రం చేస్తున్నామ‌ని యూనిట్ అంటున్నారు. ఏమాత్రం కాంప్ర‌మైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా మందుగానే ఎనౌన్స్ చేశారు. అంతా ప‌క్కా ప్లానింగ్ గా రూపోందిస్తున్న ఈ చిత్రాన్ని  2018, ఏప్రిల్ 27న విడుదల చేస్తున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ - శేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.  
ఈ సంద‌ర్బంగా నిర్మాత శిరీషా శ్రీధ‌ర్ మాట్లాడుతూ.. మా బ్యాన‌ర్ లో స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న భారీ చిత్రం "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా" ప్ర‌స్తుతం ఊటి లో షూటింగ్ జ‌రుపుకుంటుంది.  చిత్రం లోని కొన్ని కీలక స‌న్నివేశాలు చిత్రీక‌ర‌ణ చేస్తున్నాము. బాలీవుడ్ న‌టుడు బోమ‌న్ ఇరాని, యాక్షన్ కింగ్ అర్జున్, శ‌ర‌త్ కుమార్ లు ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. అత్యంత భారీ తారాగాణం, సాంకేతిక నిపుణుల‌తో చిత్రాన్ని ఎక్కాడా కాంప్ర‌మైజ్ కాకుండా చిత్రీక‌రిస్తున్నాము. అని చెప్పారు. 
నటీనటులు: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ తదితరులు, సాంకేతిక నిపుణులు: ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి), ఫైట్స్ - రామ్ లక్ష్మణ్, సాహిత్యం - రామజోగయ్య శాస్త్రి, ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్, సినిమాటోగ్రఫి - రాజీవ్ రవి, సంగీతం-విశాల్ - శేఖర్, ప్రొడక్షన్ కంట్రోలర్ - డి. యోగానంద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - బాబు,  బ్యానర్ - రామలక్ష్మీ సినీ క్రియేషన్స్, సమర్పణ - k.నాగబాబు, సహ నిర్మాత - బన్నీ వాసు, నిర్మాత - శిరీషా శ్రీధర్ లగడపాటి, రచన, దర్శకత్వం - వక్కంతం వంశీ. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com