సౌదీ నేషనల్‌ డే సందర్భంగా క్యారియర్‌ నేమ్స్‌ మార్పు

- September 22, 2017 , by Maagulf
సౌదీ నేషనల్‌ డే సందర్భంగా క్యారియర్‌ నేమ్స్‌ మార్పు

జెడ్డా: సౌదీ అరేబియాలో ఫోన్‌ కంపెనీలు తమ క్యారియర్‌ నేమ్స్‌ని వినియోగదారుల ఫోన్లపై మార్చాయి. కింగ్‌డమ్‌ నేషనల్‌ డే సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి ఫోన్‌ కంపెనీలు. సౌదీ టెలికాం కంపెనీ, 'లవ్‌ యు కెఎస్‌ఎ' పేరుతో స్టేటస్‌ బార్‌ని, అలాగే 'కెఎస్‌ఎ 4 ఎవర్‌'ని క్యారియర్‌ నేమ్‌గానూ ఏర్పాటు చేసింది. 'కెఎస్‌ఎ 4 ఎవర్‌ & ప్రౌడ్‌ టు బి సౌదీ' అంటూ మొబైల్‌ కస్టమర్‌ ఒకరు ట్వీట్‌ చేశారు. మరో వినియోగదారుడు 'లవ్‌ యు కెఎస్‌ఎ, ఐ యామ్‌ సో ప్రౌడ్‌ టు బి వన్‌ ఆఫ్‌ యువర్‌ సిటిజన్స్‌' అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 23 సెప్టెంబర్‌ అంటే, నేడే (శనివారం) సౌదీ అరేబియా నేషనల్‌ హాలీడే వేడుకల్ని జరుపుకుంటోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com