డిజేబుల్డ్ గర్ల్ హత్యకేసులో విచారణ వాయిదా
- September 22, 2017
కువైట్ సిటీ: డిజేబుల్డ్ అయిన ఐదేళ్ళ చిన్నారిని హతమార్చిన కేసులో ఓ మహిళ, ఓ వ్యక్తిపై విచారణ అక్టోబర్ 4వ తేదీకి వాయిదా పడింది. ఆగస్ట్‌లో ఆపరేషన్స్ రూమ్ - మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్‌కి ఓ ఫోన్ కాల్ అందింది. ఓ మహిళ, తన కుమార్తె అచేతనావస్థలో పడి ఉందని ఆ ఫోన్ కాల్ ద్వారా తెలియజేసింది.అల్ కోసుర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సెక్యూరిటీ సిబ్బంది, పారామెడిక్స్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వారు గుర్తించారు. ఆమె ఒంటిపై గాయాలున్నట్లుగా ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. విచారణలో ఇది హత్యగా నిర్ధారణ అయ్యింది. దాంతో, తల్లిని అదుపులోకి తీసుకున్నారు. తరచూ ఆమె బాయ్‌ఫ్రెండ్ కూడా ఆ ఇంటికి వచ్చేవాడని తెలుసుకున్న పోలీసులు, అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితురాలి బాయ్‌ఫ్రెండ్, చిన్నారిని తీవ్రంగా, కొట్టి హింసించాడని పోలీసులు నిర్ధారించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







