గ్యాంబ్లింగ్: దుబాయ్‌లో 12 మంది అరెస్ట్
- September 22, 2017
చైనాకి చెందిన 12 మంది గ్యాంబ్లింగ్ డెన్ నిర్వహిస్తూ పట్టుబడ్డారు. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. నైఫ్‌లోని ఓ ఫ్లాట్‌ని డెన్‌గా ఏర్పాటు చేసుకుని, ఇక్కడ గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారు. డ్రగ్స్‌కి సంబంధించి తొలుత సమాచారం అందిందనీ, ఆ సమాచారంతో తనిఖీలు నిర్వహించగా గ్యాంబ్లింగ్ బయటపడిందని యాంటీ నార్కోటిక్స్ వర్గాలు వెల్లడించాయి. జూన్ 15న తెల్లవారు ఝామున 2 గంటల సమయంలో యాంటీ నార్కోటిక్స్ డివిజన్‌కి చెందిన అధికారులు రెయిడ్ నిర్వహించారు. వీరిని ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేయడం జరిగింది. కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్‌లో వీరిపై కేసులు నమోదయ్యాయి. వివిధ దేశాలకు చెందిన కరెన్సీని కూడా నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు అధికారులు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్, నిందితుల నుంచి మూత్ర నమూనాల్ని సేకరించగా, అ ఫలితాలు నెగెటివ్‌గా తేలాయి. అనంతరం వీరిపై గ్యాంబ్లింగ్ సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







