రాంచరణ్ కి సొంత బావ పోటీ కానున్నాడా?

- September 23, 2017 , by Maagulf
రాంచరణ్ కి సొంత బావ పోటీ కానున్నాడా?

మెగాస్టార్ కుటుంబం నుండి మరో నటుడు వస్తున్నాడా? చిరు అల్లుడు కళ్యాణ్ నటుడిగా పరిచయం కానున్నాడా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. చిరు చిన్న కుమార్తె శ్రీజ భర్త కల్యాణ్‌ నటుడిగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్లు టాక్.
కళ్యాణ్ కు యాక్టింగ్ అంటే చాలా ఆసక్తి ఉందట. ఈ నేపథ్యంలో వైజాగ్‌లో శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. కల్యాణ్‌కి శిక్షణ ఇవ్వమని స్టార్‌-మేకర్‌' సత్యానంద్‌ను కలిశారట మెగాస్టార్ . పవన్‌కల్యాణ్‌, రవితేజ, మహేశ్‌బాబు, ప్రభాస్‌, వరుణ్‌తేజ్‌.. తదితరులు సత్యానంద్‌ దగ్గర శిక్షణ పొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కళ్యాణ్ కూడా యాక్టింగ్ లోకి అడుగుపెడితే మెగా కుటుంబం నుండి మరో నటుడు వచ్చినట్లే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com