'మహానుభావుడు' కు అతిధిగా విచ్చేయనున్న ప్రభాస్
- September 24, 2017
హైదరాబాద్: శర్వానంద్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'మహానుభావుడు'. ఈ చిత్రానికి మారుతీ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. సింగిల్ కట్ లేకుండా సెన్సార్ బోర్డు చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చినట్లు యూనిట్ సభ్యులు తెలిపారు. కాగా ఈ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుకను నేటి సాయంత్రం నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ దీనికి వేదిక కానుంది. అయితే ఈ వేడుకకు డార్లింగ్ ప్రభాస్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది.
యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. మెహరీన్ కథానాయిక పాత్ర పోషించారు. ఎస్. తమన్ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్ను విడుదల చేశారు.
వినోదాత్మకంగా సాగే ఈ ప్రచార చిత్రానికి మంచి స్పందన లభించింది. శుభ్రతకు ప్రాణం ఇచ్చే వ్యక్తి పాత్రలో శర్వానంద్ కనిపించారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







