ఇక పై విమానాశ్రయాలలో సీఐఎస్ఎఫ్ భద్రత
- September 24, 2017
ఉడాన్ పేరుతో తక్కువ ఖర్చుతో ప్రాంతీయ అనుసంధానత కల్పించడానికి అమల్లోకి వచ్చిన పథకం కింద వివిధ విమానాశ్రయాలకు అవసరమైన భద్రత కల్పించాలని కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సీఐఎస్ఎఫ్) నిర్ణయించింది. ఉగ్రవాద ముప్పును నివారించడానికి వీలుగా ఈ మేరకు ఒక ప్రణాళికను రూపొందించింది. కొత్తగా రాకపోకలు మొదలైన విమానాశ్రయాలకు 13 నుంచి 44 మంది సిబ్బందితో సీఐఎస్ఎఫ్ భద్రత కల్పిస్తుంది. శాశ్వత ప్రాతిపదికన వీరిని మోహరించే బదులు విమానాలు రాకపోకలుచేసే సమయాల్లో మాత్రమే సేవలందేలా చేయనున్నామనీ, ఇది ఆర్థికంగానూ మెరుగైన ప్రతిపాదన అనీ సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఒ.పి.సింగ్ ఒక వార్తాసంస్థకు తెలిపారు. విమానాశ్రయాల వారీగా కాకుండా విమానాల వారీగా భద్రత కల్పించడం ఉభయులకూ ప్రయోజనకరమని చెప్పారు. సమీపంలోని సీఐఎస్ఎఫ్ యూనిట్ నుంచి బలగాలను విమానాశ్రయానికి పంపించి, అన్ని రకాల తనిఖీలను వారి చేత చేయించాక మళ్లీ అదే యూనిట్‌కు మళ్లిపోయేలా చేస్తామన్నారు. ఈ ప్రతిపాదనను పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు పంపించామనీ, అక్కడి నుంచి ఆమోదం లభించాక ఈ తరహా భద్రత అమల్లోకి వస్తుందని చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







