భారత్ మహిళ 14 సంవత్సరాలు సౌదీలో నరకం అనుభవించారు
- September 25, 2017
సౌదీ అరేబియాలో తాను భయంకరమైన నరకాన్ని అనుభవించానని.. 14 సంవత్సరాల పాటు నరకం అనుభవించానని ఓ బాధిత మహిళ మీడియాకు చెప్పింది. తనను జంతువులా హింసించారని.. సౌదీ అరేబియా నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరిన బాధితురాలు వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. ఉడిపి ప్రాంతానికి చెందిన 42 ఏల్ల జసింత మెండోనికాను ముంబైకి చెందిన ఓ ఏజెన్సీ ఖతార్‌లో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మ బలికింది.
కానీ సౌదీ అరేబియాలో యంబు ప్రాంతంలోని ఓ ఇంట్లో పనికి కుదిర్చారు. మెండోనికా పనిచేసే ఇంటి యజమానులు ఆమెను తీవ్రంగా హింసించింది. వాటిని తాళలేక మెండోనికా గత ఏడాది నవంబరులో పారిపోయేందుకు ప్రయత్నించింది. కానీ అధికారులు ఆమెను పట్టుకుని మళ్లీ యజమాని ఇంటికి పంపించేశారు. ఆ తర్వాత మెండోనికా పరిస్థితి మరీ అధ్వానంగా మారిపోయింది.
ఎంత బతిమలాడుకున్నా కానీ ఆమెకు తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వకుండా కర్కశంగా ప్రవర్తించారు. ఎట్టకేలకు మెండోనికాను 14 నెలల తర్వాత మానవహక్కుల పరిరక్షణ సంస్థ సిబ్బంది కాపాడింది. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







