ఇటలీ ‌లో నిర్వహించిన ఎయిర్‌షోలో ప్రమాదం.. విమానం కూలి పైలెట్ దుర్మరణం

- September 25, 2017 , by Maagulf
ఇటలీ ‌లో నిర్వహించిన ఎయిర్‌షోలో ప్రమాదం.. విమానం కూలి పైలెట్ దుర్మరణం

ఇటలీ ‌లో నిర్వహించిన ఎయిర్‌షోలో విన్యాసాలు చేస్తున్న ఓ విమానం సముద్రంలో కుప్పకూలింది. టెరాసినా సముద్రతీరంలో ఇటలీ ఎయిర్‌ఫోర్స్‌ విన్యాసాలు నిర్వహించింది. వీటని చూడడానికి వేలాది మంది తరలివచ్చారు. విన్యాసాలు అద్భుతంగా సాగుతున్న సమయంలో.. యూరో ఫైటర్‌ జెట్‌ ఒక్కసారిగా అదుపు తప్పింది. సముద్రంలోకి వేగంగా దూసుకెళ్లి కూలిపోయింది. విమానం కూలిపోవడాన్నిచూసిన పర్యాటకులు ఒక్కసారిగా షాక్‌ తిన్నారు. ఈ ప్రమాదంలో పైలెట్ దుర్మరణం చెందినట్లు ఇటలీ ఎయిర్‌ఫోర్స్ ప్రకటించింది. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు మొదలుపెట్టింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com