అబ్బాయ్ 'రంగస్థలం' ఫస్ట్ లుక్ రిలీజ్ చెయ్యనున్న బాబాయ్

- September 25, 2017 , by Maagulf
అబ్బాయ్ 'రంగస్థలం' ఫస్ట్ లుక్ రిలీజ్ చెయ్యనున్న బాబాయ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లను రంగస్థలం ఒకే వేదిక మీదకి తీసుకొని రాబోతున్నది. అవును బాబాయ్ అబ్బాయిలిద్దరిని ఒకే స్టేజ్ మీద చూడబోతున్నారు మెగా అభిమానులు. వీరిద్దరినీ కలుపుతోంది ఏంటో తెలుసా...? రంగస్థలం. అదే రామ్ చరణ్ నటిస్తున్న కొత్త సినిమా రంగస్థలం 1985. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పీరియాడిక్ ఫిల్మ్ గా రాబోతుంది. చరణ్ ఇందులో పల్లెటూరి కుర్రాడుగా కనిపించబోతున్నాడు. లుక్, బాడీ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నాయి. సహజత్వానికి దగ్గరగా ఉండేలా ఈ సినిమా షూటింగ్ గోదావరి పరిసర ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్ ఎక్కువగా జరిగింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాని రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే దసరా కానుకగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది రంగస్థలం టీమ్. ఈ లుక్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతులమీదగా రిలీజ్ చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అబ్బాయ్ చరణ్ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత బాబాయ్ అబ్బాయ్ లను ఒకే వేదికపై మెగా అభిమానులు చూడడం.. దసరా పండగ సెలబ్రేషన్స్ లా మెగా అభిమానులు ఫీల్ అవుతున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com