మెమరీ కార్డ్‌ కోసం సోదరుడ్ని చంపిన వ్యక్తి

- September 25, 2017 , by Maagulf
మెమరీ కార్డ్‌ కోసం సోదరుడ్ని చంపిన వ్యక్తి

24 ఏళ్ళ బంగ్లాదేశీ వ్యక్తి తన సోదరుడ్ని సిజర్‌తో పొడిచి చంపేసిన ఘటనకు సంబంధించి అజ్మన్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ క్రిమినల్‌ కోర్టుకి ఈ కేసును రిఫర్‌ చేసింది. కెమెరాకి సంబంధించిన మెమరీ కార్డ్‌ విషయమై అన్నదమ్ముల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కేవలం 100 దిర్హామ్‌ల విలువైన మెమరీ కార్డ్‌ కోసం ఈ హత్య జరగడం ఆందోళన కలిగించే అంశం. గొడవ జరుగుతున్న సమయంలో సోదరుల్ని వారించేందుకు సోదరి తీవ్రంగా ప్రయత్నించినా, గొడవ ముదిరి పాకాన పడ్డం, సోదరులిద్దరూ ఆవేశకావేశాలకు పాల్పడటంతో జరగరాని ఘోరం జరిగిపోయింది. నిందితుడు, సోదరుడితోనూ, సోదరితోనే కాక, తల్లితోనూ మెమరీ కార్డ్‌ కోసం గొడవపడ్డాడు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com