వేధింపులు తాళలేక మూడో అంతస్థుపై నుంచి కిందికి దూకిన ఓ ఇండోనేషియా మహిళ
- September 25, 2017
షార్జా: పని మనుష్యులంటే తమ బానిసలు అనుకోని వారిని హీనాతిహీనంగా కొందరు యజమానులు చూస్తున్నారనేది వాస్తవం. ఆ భారతదేశానికి చెందిన ఓ యజమాని వేధింపులు తాళలేక వారి చెర నుంచి బయటపడేందుకు ఓ ఇండోనేషియా మహిళ మూడో అంతస్థుపై నుంచి కిందికి దూకింది. ఆ ప్రయత్నంలో ఆ మహిళ వికలాంగురాలిగా మారిపోయింది. ఆమె చేసిన సాహసంలో బాధిత మహిళ నడుము, ఓ కాలు విరిగాయి. మూడో అంతస్థు మీద నుంచి ఓ కిటికి గుండా దూకుతున్న ఆమెను ఇరుగుపొరుగువారు గమనించారు. సమాచారాన్ని పోలీసులకు అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిస్సహాయస్థితిలో ఎటూ కదలలేని బాధిత మహిళను అల్ కువైటీ హాస్పిటల్కు తరలించారు. మహిళ తీవ్రంగా గాయపడిందని హాస్పిటల్ వైద్యులు తెలిపారు. భారత్కు చెందిన యజమాని ఇంట్లో తనతోపాటు మరో మహిళను బంధించాడని, అతడి నుంచి తప్పించుకోవడానికి ఈ ప్రయత్నం చేశానని బాధిత మహిళ పోలీసులకు తెలిపింది. బాధిత మహిళ ఇండోనేషియా పౌరురాలని పోలీసులు తెలిపింది.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







