దసరా రోజు 50 అడుగుల ఎత్తయిన డేరా బాబా దహనం

- September 25, 2017 , by Maagulf
దసరా రోజు 50 అడుగుల ఎత్తయిన డేరా బాబా దహనం

డేరాబాబా అరాచకాలు బయటపడ్డాక రావణాసురుడయ్యాడు.  అంతకు ముందు కొన్ని వేల మందిని మోసగించి ఎన్నో రాచకార్యాలు వెలగబెట్టాడు.  డేరా మాటున ఎన్ని అక్రమాలు చేసినా ఎవరూ అడిగే వాడు లేడనుకున్నాడు.  ఈ నేపథ్యంలో ఎన్ని అరాచకాలు, అత్యాచారాలు చేసినా వెలుగు చూడలేదు. అయితే కాలం కలిసిరాక డేరా బాబా గుట్టు రట్టయింది. ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తయ్యాడు. మధ్యప్రదేశ్‌ వాసులు డేరాబాబా గుర్మీత్ రామ్ రహీం బొమ్మను రానున్న దసరా పర్వదినం రోజు ఇక్కడి ఇండోర్‌లో దహనం చేయనున్నారు.  ఇందుకోసం 50 అడుగుల ఎత్తయిన డేరా బొమ్మను తయారు చేశారు. రావణాసురుడిలా 10 ముఖాలను చిత్రించారు. సాధు సన్యాసులే ఈ దహన కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com