ఐర్లాండ్‌లోని డబ్లిన్ నగరంలో బతుకమ్మ సంబురాలు
- September 26, 2017
ఐర్లాండ్‌లోని డబ్లిన్ నగరంలో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. తెలంగాణ ఎన్నారైలు(తెలంగానైట్స్ ఆఫ్ ఐర్లాండ్) ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ప్రవాస తెలంగాణవాసులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. గత ఐదేళ్ల నుంచి ఐర్లాండ్‌లో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. రంగు రంగుల పూలతో బతుకమ్మలను పేర్చిన మహిళలు, యువతులు బొడ్డెమ్మలను ఆడారు. దాండియాతో అందరినీ అలరించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఐర్లాండ్‌లో వెల్లివిరిశాయి. అందంగా పేర్చిన బతుకమ్మలకు బహుమతులను అందజేశారు నిర్వాహకులు. బతుకమ్మ వేడుకలకు వచ్చిన వారందరికీ రుచికరమైన వంటకాలను వడ్డించారు. బతుకమ్మ వేడుకలకు ఇండియన్ ఎంబసీ తరపున సెక్రటరీ అనిత శుక్ల, ఐర్లాండ్ ఎంపీ రూత్ కోపింగర్ హాజరయ్యారు. తెలంగాణ ఎన్నారైలు..జగన్ మేకల, ప్రబోధ్ మేకల, కమలాకర్ కోలన్, సాగర్, శ్రీనివాస్ కార్పె, రాజేష్ ఆది, రవీందర్ చప్పిడి, వెంకట్ అక్కపల్లె, వెంకట్ గాజుల, బలరాం కొక్కుల, వెంకట్ జూలూరి, శ్రీనివాస్ పటేల్, షరీష్ బెల్లంకొండ, శ్రీకాంత్ సంగిరెడ్డి, శశిధర్ మర్రి, దయాకర్ కొమురెల్లి, అల్లంపల్లి శ్రీను, అల్లే శ్రీను, సుమంత్ చావా, వెచ్చ శ్రీను, సిల్వెని శ్రీను, ప్రవీణ్లాల్, ప్రదీప్ యల్క, వెంకట్ యానాల, త్రీషిర్ పెంజర్ల, నగేష్ పొల్లూరు, నవీన్ గడ్డం, వెంకట్ తిరుకోవలురు, సునీల్ పాక, శ్రీధర్ యమసాని, కొసనం శ్రీను, శ్యామ్, వినోద్ పేరూరి, కల్లూరి గోపి, రామ గౌడ్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







