రష్యాలోని ఆదర్శ దంపతులు.. నరమాంసం మాత్రమే తింటారు
- September 26, 2017
ఒక జంతువు మరో జంతువుని చంపి తినడం ప్రకృతి సహజం. ఆధునిక మానవుడు కూడా అనాగరికంగా ప్రవర్తిస్తున్నాడు. మనుషులు కూడా మృగాల్లా మారిపోతున్నారు. ఈ మధ్య ఇలాంటి వార్తలు తరచూ వింటున్నాము. నరమాంస భక్షకులు మనుషుల మధ్యే సంచరిస్తున్నారు. మనుషుల్ని వెంటాడి, వేటాడి హత్య చేసి శుభ్రంగా ఆరగించేస్తున్నారు. రష్యాలోని క్రాస్రోడర్లో నివసిస్తున్న దిమిత్రి భక్షీవ్ తన భార్య నటాలియా ఇద్దరూ నరమాంస భక్షకులు. వీరు మనుషులను హత్య చేసి వారి అవయవాలను హాయిగా భుజించేస్తున్నారు. గత కొన్నేళ్లుగా వీరీపని చేస్తున్నారు. పండ్ల మధ్యలో మృతదేహాల అవయవాలను పెట్టి తినేస్తున్నారు. వీరు చేసే ఈ పనిని సెల్ఫీల్లో బంధించేవారు. ఈ క్రమంలో దిమిత్రి తన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నాడు. ఓ వ్యక్తికి ఈ ఫోన్ దొరకగా అతడు దానిని పోలీసులకు అప్పగించాడు. పోలీసులు ఫోన్లో డాటాను చెక్ చేయగా మృత దేహాల అవయవాలు తింటున్న భార్యా భర్తలు కనిపించడంతో మాస్కో పోలీసులు వీరిని పట్టుకుని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. 1999 నుంచి దాదాపు 30 మందిని హత్య చేసి వారి అవయవాలు తింటున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. వీరి ఇంటి సెల్లార్లో మరిన్ని మృతదేహాలు గుర్తించారు. హత్యకు గురైనవారిలో కేవలం ఏడుగురిని మాత్రమే పోలీసులు కనిపెట్టగలిగారు. గతంలో ఫిలిఫ్పీన్స్లోనూ, దుబాయ్‌లోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. హత్య చేసి వారి మాంసాన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుని తిన్న ఘటనలు గతంలో కూడా వెలుగు చూసాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







