సింగపూర్‌లో టీసీఎస్‌ఎస్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు
- September 26, 2017
విదేశాల్లో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. విదేశాల్లో ఉన్న ప్రవాస తెలంగాణవాసులు అక్కడ నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్(టీసీఎస్‌ఎస్) ఆధ్వర్యంలో సింగపూర్ తెలుగు సమాజం(ఎస్‌టీఎస్) కలిసి బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ బతుకమ్మ సంబురాల్లో సుమారు 1500 మంది వరకు పాల్గొన్నారు. బతుకమ్మ పాటలతో సింగపూర్ హోరెత్తిపోయింది. ప్రవాస తెలంగాణవాసులే కాకుండా.. పంజాబీలు, చైనీయులు, తమిళులతో పాటు వివిధ రాష్ర్టాలకు చెందిన వారు పాల్గొని బతుకమ్మ వేడుకలు గొప్పగా ఉన్నాయని అభినందించారు. ఉత్తమ బతుకమ్మ, ఉత్తమ సాంప్రదాయ వేషధారణకు నిర్వాహకులు బహుమతులను అందజేశారు. టీసీఎస్‌ఎస్ నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు ఈ సందర్భంగా బహుమతులను ప్రదానం చేశారు. సింగపూర్‌లో జరిగిన బతుకమ్మ వేడుకల నేపథ్యంలో టీసీఎస్‌ఎస్‌కు ఎంపీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. సింగపూర్‌లో తెలంగాణ సంస్కృతిని తెలియజేస్తూ.. ఇక్కడి సంప్రదాయాలను అక్కడ కొనసాగించడం శుభపరిణామమని కవిత పేర్కొన్నారు.
సింగపూర్‌లో ఉన్న రెండు సంఘాలు స్నేహపూర్వక వాతావరణంలో బతుకమ్మ సంబురాలు జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందన్నారు కవిత. ఈ బతుకమ్మ వేడుకలకు సమన్వయకర్తలుగా ముదం స్వప్న, మొగిలి సునిత రెడ్డి, నడికట్ల కళ్యాణి, గోనె రజిత, చిట్ల విక్రమ్, టేకూరి నగేష్, రాజశేఖర్, ప్రదీప్ వ్యవహరించారు. ఈ సంబురాల్లో టీసీఎస్ఎస్ అధ్యక్షులు బండ మాధవ రెడ్డి, మరియు ఎస్టీఎస్ అధ్యక్షులు రవి రంగా, టీసీఎస్ఎస్ ఉపాధ్యక్షులు బూర్ల శ్రీనివాస్, నీలం మహేందర్, పెద్ది చంద్ర శేఖర్ రెడ్డి, ముదం అశోక్, టీసీఎస్ఎస్ కార్యదర్శి బసిక ప్రశాంత్ తో పాటు ఇరు సంస్థల కార్యవర్గ సభ్యులు గడప రమేష్ బాబు, పెరుకు శివ రామ్ ప్రసాద్, మొగిలి సునీత రాజేందర్, గర్రేపల్లి శ్రీనివాస్, నల్ల భాస్కర్, దుర్గా ప్రసాద్, పెద్దపల్లి వినయ్, చిలుక సురేష్, చేన్నోజ్వాల ప్రవీణ్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, ఎల్లా రాం, ఆర్సీ రెడ్డి, చెట్టిపల్లి మహేశ్, దామోదర్ గోపగొని, భరత్ రెడ్డి పింగ్లి పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







