దుబాయ్‌లో ఫస్ట్ సెల్ఫ్ ప్లయింగ్ టాక్సీ
- September 26, 2017
సాంకేతిక అభివృద్ది, వినియోగంలో టాప్‌ప్లేస్ లో దూసుకుపోతున్న దుబాయ్ మరోఘనతను సాధించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి డ్రైవర్ రహిత గగన విహంగ వాహనం (ఫస్ట్ సెల్ఫ్ ప్లయింగ్ టాక్సీ) సోమవారం ప్రారంభించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అటానమస్ ఫ్లయింగ్ ట్యాక్సీ సేవలను ప్రారంభించి ఇన్నోవేషన్ లో అరబ్ ప్రపంచాన్ని శిఖరాగ్రాన నిలిపింది.
18 ప్రొపెల్లర్లతో జర్మన్ డ్రోన్ సంస్థ వోలోకాప్టర్ దీన్ని అభివృద్ధి చేసింది. చిన్న, రెండు-సీటర్ హెలికాప్టర్ కాబిన్‌తో దీన్ని రూపొందించింది. దుబాయ్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ కోసం ఏర్పాటు చేసిన వేడుకలో తొలి టెస్ట్ రన్ నిర్వహించారు. టెస్ట్ రన్‌లోఈ వాహనం సుమారు 200 మీటర్ల ఎత్తుకు చేరుకుంది. విపత్కర పరిస్థితుల్లో ఆదుకునేలా బ్యాక్‌బ్యాటరీలు, రోటర్స్, రెండు పారాచూట్లు లాంటిరక్షణ పరికరాలు కూడా జోడించింది. డ్రైవర్ రహిత ఎగిరే ట్యాక్సీ పనితీరును, ఆపరేషన్‌ను గ్రౌండ్ నుండి మానిటర్ చేసే వ్యవస్థ ఉంటుంది. జీపీఎస్ వ్యవస్థ గరిష్టంగా 30 నిమిషాల పాటు నిరంతరం ఎగురుతుంది.
కాగా 2021 నాటికి ఒక మానవరహిత డ్రోన్‌ను మార్స్ మీదికి పంపాలని దుబాయ్ పథకాలు రచిస్తోంది. తద్వారా అంతరిక్షంలో తొలిసారి అడుగుపెట్టబోతోంది. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం , కరెంట్ టెక్నాలజీని స్వీకరించడం దేశ అభివృద్ధికి దోహదం చేయడం మాత్రమేకాకుండా భవిష్యత్ తరానికి వంతెన వేస్తుందని దుబాయ్ రాజు షేక్ హందాన్ చెప్పారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







