నాన్ క్రిమినల్ అపెన్స్లకు అమ్నెస్టీ:షార్జా రూలర్
- September 26, 2017
షార్జా: షార్జా రూలర్, సుప్రీమ్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి, భారతదేశంలోని కేరళలో పర్యటిస్తున్న సందర్భంలో, కీలక ప్రకటన చేశారు. షార్జా జైలులో శిక్ష అనుభవిస్తోన్న వివిధ జాతీయులకు క్షమాభిక్ష పెడుతున్నట్లు చెప్పారాయన. నాన్ క్రిమినల్ అఫెన్స్ల కారణంగా మూడేళ్ళ జైలు శిక్ష పూర్తి చేసుకున్న ఖైదీలకు ఈ క్షమాభిక్ష వర్తించనుంది. యూనివర్సీటీ ఆఫ్ కాలికట్ నుంచి డాక్టరేట్ అందుకున్న షార్జా రూలర్, ఈ ప్రకటన చేయడంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, షార్జా జైలులో మగ్గుతున్న ఖైదీలు (లేబర్ సంబంధిత, వీసా కేసుల కారణాలతో) విడుదలకు మార్గం సుగమం చేయాలని కోరడంతో షార్జా రూలర్ ఈ నిర్ణయం ప్రకటించారు. బుధవారం కోచిలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో షార్జా రూలర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి పాల్గొంటారు.
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







