ఇండియన్ లాయర్‌కు ఆల్టర్నేటివ్ నోబెల్ అవార్డు
- September 26, 2017
హైదరాబాద్: పేద ప్రజల హక్కుల కోసం నిత్యం పోరాటం చేసిన భారతీయ లాయర్ కొలిన్ గొంజాల్వెస్‌కు ఈ ఏడాది ఆల్టర్నేటివ్ నోబెల్ దక్కింది. దీన్నే ద రైట్ లైవ్లీహుడ్ అవార్డుగా పిలుస్తారు. పేదలు, మైనార్టీలు, మహిళలు, పిల్లలు, కార్మికుల హక్కుల కోసం కొలిన్ గొంజాల్వెస్ చాన్నాళ్లుగా ఉద్యమం చేస్తున్నారు. 1980 నుంచి ఆల్టర్నేటివ్ నోబెల్‌ను ఇస్తున్నారు. నోబెల్ కమిటీ పట్టించుకోని వ్యక్తులకు రైట్ లైవ్లీహుడ్ ఈ అవార్డులను ప్రకటిస్తుంది. ఈ ఏడాది మొత్తం ముగ్గురు వ్యక్తులకు ఆల్టర్నేటివ్ నోబెల్ ప్రకటించారు. కొలిన్ గొంజాల్వెస్‌తో పాటు జర్నలిస్టు ఖదిజా ఇస్మాయిలోవా, ఇథోపియా న్యాయవాది యెట్నబెర్ష్ నిగుసీలు ఉన్నారు. దాదాపు 4 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీని ముగ్గురు పంచుకుంటారు. పిల్ దరఖాస్తులతో అభాగ్యుల జీవితాలను మార్చేందుకు గొంజాల్వెస్ చేస్తున్న ప్రయత్నాలను కొనియాడుతున్నట్లు ఆల్టర్నేటివ్ నోబెల్ కమిటీ పేర్కొన్నది. 1989 నుంచి గొంజాల్వెస్.. హ్యూమన్ రైట్స్ లా నెట్‌వర్క్ సంస్థను నడిపిస్తున్నారు. ఇప్పుడు దేశంలో ఇదే పబ్లిక్ ఇంట్రెస్ట్ గ్రూప్.ఈ గ్రూప్‌లో సుమారు 200 మంది లాయర్లు ఉన్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







