బిన్ లాడెన్ పై 'అబోట్టాబాద్‌' సినిమా!

- September 26, 2017 , by Maagulf
బిన్ లాడెన్ పై 'అబోట్టాబాద్‌' సినిమా!

ముంబయి: ప్రపంచాన్ని గడగడలాడించిన ఉగ్రవాది ఒసామా బిన్‌లాడెన్‌ జీవితాధారంగా సినిమా రాబోతోంది. బాలీవుడ్‌ దర్శకుడు విశాల్‌ భరద్వాజ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.ఒసామాను పాకిస్థాన్‌లోని అబోట్టాబాద్‌లో మట్టుబెట్టారు. దాంతో సినిమాకు 'అబోట్టాబాద్‌' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
కేథరీన్‌ స్కాట్‌, క్లార్క్‌, ఆడ్రియన్‌ లివై రాసిన 'ది ఎక్సైల్‌' అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. సాధారణంగా విశాల్‌ భరద్వాజ్‌ ప్రముఖ రచయిత షేక్‌స్పియర్‌ నవలలను సినిమాలుగా తెరకెక్కిస్తుంటారు. అలా వచ్చిన వాటిలో మక్బూల్‌(మ్యాక్‌బెత్‌), ఓంకారా(ఓథెల్లో), హైదర్‌(హ్యామ్‌లెట్‌) చిత్రాలు ఉన్నాయి. ఆయన చివరిగా తీసిన చిత్రం 'రంగూన్‌' బాక్సాఫీస్‌ వద్ద విజయాన్ని అందుకోలేకపోయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com