14 దొంగతనాల కేసులో ఒక పౌరుడు అరెస్టు

- September 28, 2017 , by Maagulf
14 దొంగతనాల కేసులో ఒక పౌరుడు అరెస్టు

మస్కట్ : మస్కట్, దక్షణ షర్కియా మరియు దఖ్లీయాలో 14 దొంగతనం కేసులలో ప్రమేయం ఉన్న ఒక పౌరుడిని దర్క్లియా పోలీస్ కమాండ్  విచారణ మరియు నేర పరిశోధన విభాగం అరెస్టు చేసింది. ఒక రాయల్ ఒమాన్ పోలీస్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం, " నిందితుడు కొన్ని కేసులలో  హ్యాండ్ బ్యాగులు మరియు  300 ఆర్ ఓ విలువ చేసే నగదు అపహరించాడు " మరొక సందర్భంలో ఇజ్కీ పోలీసు స్టేషన్ పరిధిలో  అధికారులు ఇద్దరు పౌరులను అరెస్ట్ చేశారు. వారు ఫ్యూయల్ స్టేషన్ లో వారి వాహనంలో ఇంధనం పోయించుకొని డబ్బులు చెల్లించకుండా పారిపోతున్న యత్నంలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు తమ నేరాలకు ఒప్పుకున్నారు. వీరిని  తదుపరి విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఎదుటకు పంపించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com