మూడేళ్ల శిక్ష పూర్తి చేసుకోనున్న భారత ఖైదీల విడుదల
- September 28, 2017
షార్జా : ' ముద్దొచ్చినపుడు చంకను ఎక్కాలనేది మన తెలుగు సామెత...అయితే మలయాళీలు ఆ సామెతను చక్కగా ఉపయోగించుకున్నారు. బుధవారం కేరళ పర్యటనకు వచ్చిన షార్జా రాజుని ముఖ్యమంత్రి ఓ చిన్న అభ్యర్ధన చేశారు. ఫలితంగా ఎడారి దేశాలలో కారాగారాలలో మగ్గిపోతున్న 149 మందికి విమోచన దొరికింది. ఆ భారత ఖైదీలను విడుదల చేస్తూ షార్జా రాజు సుల్తాన్ మోహమ్మద్ అల్ ఖాస్మీ అప్పటికప్పుడు ఆదేశాలిచ్చారు. స్వల్ప నేరాలపై శిక్ష అనుభవిస్తున్న ఆ ఖైదీలకు క్షమాభిక్ష ఇవ్వాలని కోరుతూ ప్రస్తుతం కేరళ పర్యటనలో ఉన్న షార్జా రాజును కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన రాజు... మూడేళ్ల శిక్ష పూర్తి చేసుకోనున్న భారత ఖైదీల విడుదల చేస్తూ తక్షణ ఆదేశాలిచ్చారు. షార్జా రాజు ఖాస్మీ కేరళావాసి లులూ సూపర్ మార్కెట్ అధినేత యూసుఫ్ అలీ ఇంట్లో ఆతిథ్యం బుధవారం స్వీకరించారు.
తాజా వార్తలు
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!







