భారతదేశంకు తిరిగొచ్చిన ఫాదర్ టామ్
- September 29, 2017
మస్కట్ : గతేడాది యెమెన్‌లో ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) తీవ్రవాదుల చేతికి చిక్కిన కేరళకు చెందిన క్రైస్తవ మతాధిపతి టామ్ ఉళున్నాలిల్‌ను భారత, ఒమన్ ప్రభుత్వాలు విజయవంతంగా రక్షించాయి. ఆయన ఇప్పుడు సురక్షితంగా భారతదేశానికి తిరిగి వచ్చారు..2016, మార్చి 4న యెమెన్‌లోని ఏడెన్ ప్రాంతంలో మిషనరీస్ ఆఫ్ ఛారిటీలపై ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు దాడి చేశారు. ఆ దాడిలో దాదాపు 16 మందిని వారు హతమార్చారు. అనంతరం ఫాదర్ టామ్ ను తీవ్రవాదులు చెరలో బంధించారు. ఈ ఏడాది మేలో తనను కాపాడాలని కోరుతూ టామ్ ఓ వీడియోను యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాడు. కిడ్నాపర్లు తమ డిమాండ్లను చెప్పేందుకు భారత ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు టామ్ ఆ వీడియోలో పేర్కొన్నారు. ఆయన కిడ్నాప్ అయినప్పటి నుంచి భారత ప్రభుత్వం ఫాదర్ టామ్ ను విడిపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఇండియాతో పాటు ఓమన్ ప్రభుత్వం టామ్‌ను విడిపించేందుకు చేసిన ప్రయత్నాలు విజయవంతమయ్యాయి.18 నెలల పాటు తీవ్రవాదుల బందిఖానాలో గడిపిన ఆయన ఇటీవల విడుదల అయ్యారు. ఈ సెప్టెంబర్‌లో ఒమాన్ కాపాడిన తరువాత, ఫాదర్ టామ్ వాటికాన్ సిటీకి వెళ్లారు. అక్కడ పొప్ ఫ్రాన్సిస్ తో ఒక భావోద్వేగ సమావేశం అనంతరం ఇంకొక పనిని చేపట్టే ముందు భారతదేశంలో ఉన్న కుటుంబంను సందర్శించండని పొప్ సూచన మేరకు స్వదేశానికి ఆయన తిరిగివచ్చారు. భారత విదేశాంగ మంత్రిని ఈ సందర్భంగా ఫాదర్ టామ్ మర్యాదపూర్వకంగా కలిశారు "ఇంటికి స్వాగతం!" ఫాదర్ టామ్ ఉహుశాలన్ సుష్మాస్వరరాజ్ సాదరంగా స్వాగతించారు ఇటీవలే యెమెన్‌లో విడుదలైన తరువాత న్యూఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారిక అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ట్వీట్ చేశాడు. సురక్షితంగా తన విడుదలకు కృషి చేసిన వారందరికీ వారి కుటుంబ సభ్యులు, క్రైస్తవ మతాధిపతులు భారత, ఒమన్ ప్రభుత్వాలకు ఈ సందర్భంగా ఫాదర్ టామ్ కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









