దుబాయ్ లో అలరించిన కుమారి శ్రావణి నృత్యం

- November 01, 2015 , by Maagulf

కూచిపూడి నాట్యం లొ 10 సంవత్సరాలుగా సాధన చేస్తూ గల్ఫ్ లొ వున్న అన్ని తెలుగు సంస్థలలొను నాట్యం చేసి ఆహూతులను అలరిస్తూ అందరి మన్ననలను పొందుతున్నది. 2015 మే లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటి నుంచి కుచిపూడి నాట్యం సర్టిఫికేట్ కోర్స్ లో ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణురాలయ్యింది.

2014 లో జరిగిన సిలికాన్ ఆంధ్ర మహాబృంద నాట్యం లో కూడా పాల్గొని గిన్నీసు బుక్  లో కూడ స్థానం  సంపాదించినది.  షార్జా లో జరిగిన ఆట-పాట రియాల్టి షొ లో ప్రధమ స్థానం సంపాదించినది. యు ఏ ఇ లో అన్ని ఎమిరేట్స్ ల లోను మలయళ, తమిళ్, తెలుగు మరియు ఇస్కాన్  లలో కుడా ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది.2014 లో హైదరాబాద్ జతీస్ నట్యొత్సవం లో నాట్య వేద  అవార్డ్ ను, విశాఖ భారత్ నాట్యొత్సవం లో యువ నాట్య సారధి అవార్డ్ ను  పొందడం జరిగింది.

 

ఇటు నాట్యం లోను అటు కరాటే లోను సాధన సాగిస్తూ ప్రస్తుతం బ్లాక్ బెల్ట్ కు సాధన కొనసాగిస్తున్నది.ఒయాసిస్ కరాటే వారి సంవత్సర కార్యక్రమం లో కుడా వాళ్ళ అమ్మగారు లక్ష్మీ కామేశ్వరి గాత్రం తొ కూచిపుడి  నాట్య ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. మొదటిసారిగా గల్ఫ్ లొ ఒకే వేదిక పై తల్లి పాడడం కూతురు నాట్యం చేయడం అందరిని అలరించినది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com