అగ్ని కీలల్లోంచి డ్రైవర్‌ని రక్షించిన మహిళ
- September 29, 2017
రస్ అల్ ఖైమాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. ఈ అగ్ని కీలల్లో ఓ ట్రక్ డ్రైవర్ కాలిపోతుండగా, ఓ మహిళ అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి, ఆ డ్రైవర్‌ని కాపాడింది. అయితే ఆమె ఎవరన్నది తెలియరాలేదు. బాధితుడి సన్నిహితులు ఈ విషయాల్ని వెల్లడించారు. రస్ అల్ ఖైమా సెంట్రల్ ఆపరేషన్స్ టీమ్, సంఘటన గురించి సమాచారం అందుకోగానే అలర్ట్ అయ్యింది. రికార్డు సమయంలో సంఘటనా స్థలానికి అంబులెన్స్, పారామెడిక్స్, రెస్క్యూ టీమ్స్, ట్రాఫిక్ పోలీస్ చేరుకున్నారు. బాధితుడ్ని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఇంకో వైపున రస్ అల్ ఖైమా పోలీసులు, ఈ ఘటనలో బాధితుడ్ని రక్షించిన మహిళ కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. అత్యంత ధైర్య సాహసాల్ని ప్రదర్శించిన ఆ మహిళను గౌరవించడం తమ బాధ్యత అని పోలీసులు అంటున్నారు. బాధితుడు చెబుతున్న వివరాల ప్రకారం ఆ ధైర్య సాహసాల్ని ప్రదర్శించిన మహిళ ఎమిరేట్‌కి చెందినవారై ఉండొచ్చునట.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







