వాహనాల మధ్య తగలబడిపోతున్న డ్రైవర్ ను రక్షించిన ఓ మహిళ

- September 30, 2017 , by Maagulf
వాహనాల మధ్య తగలబడిపోతున్న  డ్రైవర్ ను రక్షించిన ఓ మహిళ

రస్ అల్ ఖైమా: రెండు ట్రక్కులు ఒకదాని ఒకటి  ఢీకొట్టడంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ అగ్నిజ్వాలల్లో చిక్కుకొని రక్షించమని పెద్దపెట్టున  హహకారాలు చేస్తున్న ఒక ఆసియా డ్రైవర్ ని ఒక సాహసవంతరాలైన మహిళ తన వద్ద ఉన్న అగ్నిని ఆర్పివేసే అబాయాను అతనిపై నిండుగా కప్పి ఆ వ్యక్తిని మంటల నుండి కాపాడింది. శుక్రవారం రస్ అల్ ఖైమాలో ఓ గుర్తు తెలియని మహిళ ఆపదలో ఉన్న  బాధితుడికి ప్రాణభిక్ష పెట్టి మంటల నుంచి వెలుపలకు తీసుకువచ్చింది. బాధితతుని  స్నేహితుడి కధనం ప్రకారం, తాము రస్ అల్ ఖైమా పోలీస్ కేంద్ర కార్యకలాపాల గదికి ఫోన్ ద్వారా తెలిపి అప్రమత్తం చేశామని , ట్రాఫిక్ పోలీసు, అంబులెన్సులు, పారామెడికల్  మరియు రెస్క్యూ జట్లు సంఘటన స్థలానికి చేరుకొన్నాయి బాధితుడిని వెంటనే ఆసుపత్రికి ఆసుపత్రికి తరలించారు. రాస్ అల్ ఖైమ్  పోలీసులు  తెగింపుతో ఆపదలో ఉన్న డ్రైవర్ ను రక్షించిన మహిళ కోసం వెతకడానికి ప్రయత్నిస్తున్నట్లు అంబులెన్స్ అండ్ రెస్క్యూ సెక్షన్ అధిపతి మేజర్ తారిఖ్ మొహద్ద్ అల్ శర్హాన్ చెప్పారు. రెప్పపాటులో వచ్చిన ఆ మహిళా  రెండు ట్రక్కుల మధ్య జరిగిన ప్రమాదంలో వెలువడిన మంటలలో ఆమె కనుక స్పందించకుంటా ఆ ఆసియా డ్రైవర్ సజీవ దహనమై ఉండేవాడని  ఆయన వివరించారు. ఆమె తన వీరోచిత చర్యలతో ఒక ప్రాణాన్ని కాపాడిందని పేర్కొంటూ ఆమెను గౌరవించటానికి మేము ఆ గుర్తు తెలియని ఆ మహిళ సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com