చాపలా తుఫాను ప్రభావం: సలాలా వోడరేవు మూసివేత

- November 01, 2015 , by Maagulf
చాపలా తుఫాను ప్రభావం:  సలాలా వోడరేవు మూసివేత

చాపలా తుఫాను ధోఫార్ తీరాన్ని సమీపించనున్న సందర్భంగా, సలాలా వోడరేవులో కార్యకలాపాలను నేటి సాయంత్రం వరకు  నిలిపి వేస్తున్నట్టు పోర్టు అధికారులు ప్రకటించారు. మూడు గంటల కొకసారి పరిస్థితిని సమీక్షిస్తున్నామని, ముందస్తు భద్రతా చర్యలుగా ఓడలను సముద్రం బయటకు పంపివేశామని, రేవు లోని క్రేన్ లను కట్టివేసి ఉంచామని ఆయన వివరించారు. పబ్లిక్ ఆధారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ - రీ సెర్చ్ సెంటర్ అధ్యక్షులు డా. సయీద్ అల్ శర్మి మాట్లాడుతూ, తుఫాను ధోఫార్ తీరాన్ని తాకనున్నందున అల్ హల్లానియన్ ద్వీపం మరియు ఇతర ప్రాంతాలలో వర్షపాతం మొదలైందని, అల్‌జాజెర్ ప్రాంతంలో వాడీలు పొంగిపొర్లుతున్నాయని తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com