దుబాయ్ లో అలరించిన కుమారి శ్రావణి నృత్యం
- November 01, 2015
కూచిపూడి నాట్యం లొ 10 సంవత్సరాలుగా సాధన చేస్తూ గల్ఫ్ లొ వున్న అన్ని తెలుగు సంస్థలలొను నాట్యం చేసి ఆహూతులను అలరిస్తూ అందరి మన్ననలను పొందుతున్నది. 2015 మే లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటి నుంచి కుచిపూడి నాట్యం సర్టిఫికేట్ కోర్స్ లో ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణురాలయ్యింది.
2014 లో జరిగిన సిలికాన్ ఆంధ్ర మహాబృంద నాట్యం లో కూడా పాల్గొని గిన్నీసు బుక్ లో కూడ స్థానం సంపాదించినది. షార్జా లో జరిగిన ఆట-పాట రియాల్టి షొ లో ప్రధమ స్థానం సంపాదించినది. యు ఏ ఇ లో అన్ని ఎమిరేట్స్ ల లోను మలయళ, తమిళ్, తెలుగు మరియు ఇస్కాన్ లలో కుడా ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది.2014 లో హైదరాబాద్ జతీస్ నట్యొత్సవం లో నాట్య వేద అవార్డ్ ను, విశాఖ భారత్ నాట్యొత్సవం లో యువ నాట్య సారధి అవార్డ్ ను పొందడం జరిగింది.
ఇటు నాట్యం లోను అటు కరాటే లోను సాధన సాగిస్తూ ప్రస్తుతం బ్లాక్ బెల్ట్ కు సాధన కొనసాగిస్తున్నది.ఒయాసిస్ కరాటే వారి సంవత్సర కార్యక్రమం లో కుడా వాళ్ళ అమ్మగారు లక్ష్మీ కామేశ్వరి గాత్రం తొ కూచిపుడి నాట్య ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. మొదటిసారిగా గల్ఫ్ లొ ఒకే వేదిక పై తల్లి పాడడం కూతురు నాట్యం చేయడం అందరిని అలరించినది.


తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







