సమంత చేతుల మీదుగా నారా రోహిత్ 'బాలకృష్ణుడు' టీజర్
- October 01, 2017
నారా రోహిత్, రెజీనా జంటగా తెరకెక్కుతున్న సినిమా 'బాలకృష్ణుడు'. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను దసరా రోజున స్టార్ హీరోయిన్ సమంత విడుదల చేశారు. మహేంద్ర బాబు, నందమూరి శ్రీ వినోద్, ముసునూరు వంశీ కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు పవన్ మల్లెల దర్శకత్వం వహిస్తున్నారు. రమ్యకృష్ణ, అజయ్, పృథ్వీ, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు.
టీజర్ విషయానికి వస్తే..
నారా రోహిత్‌తో రెజీనా తొలిసారి జతకట్టిన 'బాలకృష్ణుడు' టీజర్ ఆకట్టుకునేలా ఉంది. ఎప్పుడూ భిన్నమైన కథలను ఎంచుకునే నారా రోహిత్ ఈ సారి లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను సెలెక్ట్ చేసుకున్నాడు. మణిశర్మ అందించిన బ్యాంక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది.
నారా రోహిత్, రెజీనా ఇద్దరు కొంత కాలం నుంచి సక్సెస్‌లు లేకుండా ఉన్నారు. మెగా హీరోయిన్‌గా పేరున్నప్పటికీ రెజీనా ఖాతాలో సరైన సక్సెస్ లేదు. రోహిత్ కూడా భిన్నమైన కథలను ఎంచుకుంటున్నప్పటికీ బంపర్ హిట్ కొట్టలేకపోతున్నాడు. ఈ సినిమాతోనైనా నారా రోహిత్, రెజీనాకు సక్సెస్ వస్తుందేమో చూడాలి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







