మొత్తానికి దసరా బరిలో నిలుచున్నా మహానుభావుడు
- September 30, 2017
శర్వానంద్ సెంటిమెంట్ మరోసారి వర్క్ అవుట్ అయ్యింది. ఈ ఏడాది సంక్రాంతి బరిలో ఖైదీ, శాతకర్ణి చిత్రాలు ఉన్నప్పటికీ శతమానం భవతి చిత్రంతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు దసరా బరిలో ఎన్టీఆర్ జై లవకుశ , మహేష్ స్పైడర్ చిత్రాలు ఉన్నప్పటికీ మహానుభావుడు చిత్రం తో వచ్చి దసరా విన్నర్ గా నిలిచాడు.
ఆ రెండు చిత్రాల కంటే ఈ మూవీ కే ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. కంటెండ్ పరంగానే కాకుండా కామెడీ కూడా బాగుండడం తో సినీ ప్రేక్షకులు ఈ సెలవుల్లో ఈ మూవీ కే ఓటు వేస్తున్నారు. తొలి రోజు ఉదయం నుంచే ఈ సినిమా హవా అన్ని చోట్ల మొదలైంది. దీంతో సినిమా స్క్రీన్ పెంచాలని అందరూ కోరుతున్నారు. కాకపోతే 'జై లవకుశ'.. 'స్పైడర్' ప్రస్తుతం థియేటర్స్ లలో నడుస్తుండడం తో 'మహానుభావుడు' చిత్రానికి అనుకున్న స్థాయిలో స్క్రీన్లు దక్కలేదు.
ఐతే టికెట్ల కోసం డిమాండ్ బాగా ఉండటంతో షోలు, థియేటర్లు పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 'మహానుభావుడు' అదనపు షోలు, థియేటర్లు కేటాయిస్తున్నారు. రానున్న రోజుల్లో కలెక్షన్స్ మరింతగా పెరగనున్నాయని అంటున్నారు. మారుతీ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ ని యూవీ క్రియేషన్స్ వారు నిర్మించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







