బుర్జీల్ మెడికల్ సెంటర్లో వరల్డ్ హార్ట్ డే
- October 01, 2017
మస్కట్: అజీబాలోని బుర్జీల్ మెడికల్ సెంటర్లో వరల్డ్ హార్ట్ డే సెలబ్రేషన్స్ సెప్టెంబర్ 30న జరిగాయి. హృద్రోగంపై అవగాహన కల్పించేందుకుగాను ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఒక్కరిలోనూ గుండె పనితీరు పట్ల అవగాహన తప్పనిసరి అని ఈ సందర్భంగా హృద్రోగ నిపుణులు చెప్పారు. బుర్జీల్ మెడికల్ సెంటర్లో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా హృద్రోగ నిపుణులు డాక్టర్ మగెద్ అబౌల్సియోద్ నేతృత్వంలో ఉచిత కార్డియాలజీ కన్సల్టేషన్ సేవలు హృద్రోగులకు అందజేశారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా హెల్తీ హార్ట్ ప్యాకేజీలను కూడా ప్రకటించారు. వివిధ రకాలైన కారణాలతో హృద్రోగ బాధితుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోందని డాక్టర్ అబౌల్సియోద్ చెప్పారు. బుర్జీల్ మెడికల్ సెంటర్లో నిపుణులైన వైద్యులు, అత్యాధునిక సౌకర్యాలతో హృద్రోగ బాధితులకు సేవలు అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







