బహ్రెయిన్‌లో 'స్వచ్ఛతా హి సేవ' క్యాంపెయిన్
- October 01, 2017
మనామా: బహ్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ, 'స్వచ్ఛతా హి సేవా' క్యాంపెయిన్ని నిర్వహించింది. స్వచ్ఛ భారత్ అభియాన్ మూడో వార్షికోత్సవం సందర్భంగా 'స్వచ్ఛతా హీ సేవ' కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా చేపట్టేందుకు భారత ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో బహ్రెయిన్లోనూ ఇండియన్ ఎంబసీ ఈ కార్యక్రమం పట్ల అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడుతోంది. బహ్రెయిన్‌లో ఇండియన్ అంబాసిడర్ అలోక్ కుమార్ సిన్హా, ఈ సందర్భంగా స్వచ్ఛతపై అవగాహన ప్రతి ఒక్కరిలోనూ తప్పనిసరి అని చెప్పారు. ప్రముఖ బాలీవుడవ్ నటుడు సునీల్ శెట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని, అక్టోబర్ 2వ తేదీని స్వచ్ఛ భారత్ దివస్‌గా పరిగణిస్తోన్న సంగతి తెలిసినదే. అరేబియన్ క్రికెట్ ఫెస్టివల్లో పాల్గొననుండడం, అలాగే గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొనడం, స్వచ్ఛ భారత్ అవగాహన కార్యక్రమంలో పాల్గొనడం ఇవన్నీ ఒకేసారి జరగడం చాలా ఆనందంగా ఉందని సునీల్ శెట్టి చెప్పారు. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు మరింత మెరుగుపడే దిశగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామనీ ఈ సందర్భంగా అలోక్ కుమార్ సిన్హా చెప్పారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







