ఇద్దరు గల్ఫ్ ప్రవాసి కార్మిక నాయకులు డిల్లీ శిక్షణకు ఎంపిక
- October 01, 2017
తెలంగాణకు చెందిన ఇద్దరు గల్ఫ్ ప్రవాసి కార్మిక నాయకులు పోతుగంటి సాయేందర్ (నిర్మల్ జిల్లా), నంగి దేవేందర్ రెడ్డి (మహబూబ్ నగర్ జిల్లా) లు ఈనెల 3 నుండి 6 వరకు నాలుగు రోజులపాటు డిల్లీ సమీపంలోని నోయిడాలోని వివి గిరి నేషనల్ లేబర్ ఇన్ స్టిట్యూట్ లో జరిగే శిక్షణా కార్యక్రమానికి హాజరుకానున్నారు.
కార్మిక నాయకులకు సామర్థ్య పెంపుదల కార్యక్రమంలో భాగంగా "వలసలు మరియు అభివృద్ధి: సమస్యలు, ధృక్కోణాలు" అనే అంశంపై దేశంలోని ప్రముఖ విశ్వ విద్యాలయాలు, పరిశోదనా సంస్థలు, ప్రభుత్వ విభాగాలకు చెందిన నిపుణులు వీరికి శిక్షణ ఇస్తారు. ఉపన్యాసాలు, సంప్రదింపులు, చర్చలు, అధ్యయనాల ఉదాహరణల విధానంలో భోధన ఉంటుంది.
వలస మరియు అభివృద్ధి మధ్య సంబంధాల అవగాహన పెంచే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వలసల పరిశోధన, విధానపరమైన అంశాలలో ఉద్భవించే సమస్యలను అధిగమించడానికి పరిశోధకులు మరియు విధాన నిర్ణేతలు సామర్థ్యాలను అభివృద్ధి చేస్తారు. వలసలకు సంబంధించిన భావాలు మరియు సిద్ధాంతాలు అర్థం చేసుకోవడం, ప్రపంచీకరణ ఆర్ధికవ్యవస్థలో వలసలపై పోకడలు మరియు నమూనాలు పరిశీలించడం లక్ష్యం. సమకాలీన వలస విధానాలను చర్చించడం, వలసలకు అభివృద్ధికి గల సంభావ్యతను విశ్లేషించడం జరుగుతుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్‌లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!
- ఖతార్‌లో ఈ-కామర్స్, POS లావాదేవీల్లో భారీ వృద్ధి..!!
- దుబాయ్‌లో వాకింగ్, సైక్లింగ్‌కు పెద్దపీట.. 25 ప్రాంతాల కనెక్ట్ కు కొత్త ప్రణాళిక..!!
- కువైట్ లో మెరుగైన ట్రాఫిక్ సేవలకు శ్రీకారం..!!
- సౌదీలో గృహ కార్మికుల ఇకామా రెన్యూవల్‌కు కొత్త విధానం..!!
- ఇరాన్ తో యుద్ధం..17 మంది అమెరికా సైనికుల మృతి
- 2026 ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనా పై 1-0తో చారిత్రాత్మక విజయం
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్







