రూమ్మేట్ యొక్క12 ఏళ్ల కూతురిని లైంగిక వేధింపులకు పాల్పడ్డ తాగుబోతు గార్డు
- October 02, 2017
దుబాయ్: పీకలదాకా మద్యం సేవించిన ఓ తాగుబోతు తనతో ప్లాటులో నివాసముంటున్న ఓ మహిళ కుమార్తెపైన కన్నేశాడు...ఎవరూ లేని సమయం చూసి ఎక్కడెక్కడో చేతులు వేయబోయాడు అదే సమయానికి ఆ ఫ్లాట్ యజమానురాలు చూడటంతో ఆ బాలికపై ఎటువంటి అఘాయిత్యం జరగకుండా నిలువరించగలిగింది. ఈ కేసుకి సంబంధించి 37 ఏళ్ళ నిందితుడు వేధింపుల కేసులో మొదటి కోర్టులో విచారణకు వెళ్లాడు. ఫిలిప్పీన్స్ దేశానికి చెందినసెక్యూరిటీ గార్డ్, నిద్రపోతున్న 12 ఏళ్ల బాలిక శరీరంపై అసంబద్ధంగా తాకినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. నిందితుడు ఆ బాలిక తల్లి తో కల్సి ఒక అపార్ట్మెంట్ లో భాగస్వామ్య పద్ధతిలో కలిసి జీవిస్తున్నాడు. ఈ అఘాయిత్య సంఘటన ఆగష్టు 7 వ తేదీన బుర్ దుబాయ్ పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశారు. బాలిక యొక్క తల్లి, 45 ఏళ్ల వయస్సు ఉన్న క్రీడా శిక్షకురాలు , ప్రతివాది సంఘటన జరిగే ముందు మధ్యాహ్నం నుంచి మద్యపానం చేస్తున్నట్లు ఆమె తెలిపింది. చె"నేను నా కుమార్తె నిద్రించేందుకు ఉదయం 1 గంటలకు మంచం వేసాను, నేను ఉదయం 3 గంటల వరకు వంటగదిలో పని చేశాను, ప్రతివాది ఫ్లాట్ లోనే ఉన్నాడని...నా కుమార్తె ఎలా ఉందొ చూడమని నేను ఫ్లాట్ యజమానురాలిని అడిగినప్పుడు." కానీ ఆమె కొద్ది సేపటికి తిరిగి వచ్చి ఆ దుర్మార్గుడు నీ కుమార్తెను అసంబద్ధంగా శరీరాన్ని తాకుతున్నట్లు...తాను గట్టిగా కేకలు వేసేసరికి అక్కడ్నించి ప్రతివాది జారుకొన్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







