అక్టోబర్ 4న ప్రారంభం కానున్న ఖాలిద్ బిన్ హమాద్ థియేటర్ ఫెస్టివల్
- October 02, 2017
మనామా: ఖాలిద్ బిన్ హమాద్ థియేటర్ ఫెస్టివల్ ఫర్ నేషనల్ క్లబ్స్, యూత్ సెంటర్స్ అండ్ పీపుల్ విత్ డిజేబిలిటీ - అక్టోబర్ 4న ముహారాక్ మోడల్ యూత్ సెంటర్‌లో ప్రారంభం కానుంది. 18 రోజులపాటు జరిగే ఈ ఫెస్టివల్‌లో 12 ప్లేస్ ప్రదర్శితమవుతాయి. అక్టోబర్ 21న ఈ ఫెస్టివల్ ముగుస్తుంది. కింగ్‌డమ్‌కి చెందిన వివిధ ప్రాంతాల నుంచి 12 క్లబ్స్ ఈ ఫెస్టివల్‌లో పాల్గొంటున్నాయి. నటి, థియేటర్స్ ఫెస్టివల్ జ్యూరీ మెంబర్ అయిన మరియమ్ జైమాన్ మాట్లాడుతూ, ఈ ఫెస్టివల్ ఎంతో ప్రత్యేకంగా డిజైన్ చేయబడిందనీ, ఆహూతుల్ని విశేషంగా ఆకట్టుకుంటుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. 12 క్లబ్స్ మధ్య పోటీ ఆసక్తికరంగా ఉందనీ, మొత్తం 32 క్లబ్‌ల నుంచి వీటిని ఎంపిక చేశామని తెలిపారామె. ఈ ఫెస్టివల్‌లో 'డైలాగ్ ఆఫ్ ఎ బటర్‌ఫ్లై' మరో ప్రధాన ఆకర్షణ కాబోతోంది. ఈ ఫెస్టివల్‌కి గల్ఫ్ యూనివర్సిటీ ఓ స్పాన్సరర్‌గా వ్యవహరిస్తోంది.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







