దుబాయ్: ప్రాణాలు తెగించి కాపాడిన యువతికి 'అభయ ఉమన్' అవార్డు

- October 02, 2017 , by Maagulf
దుబాయ్: ప్రాణాలు తెగించి కాపాడిన యువతికి 'అభయ ఉమన్' అవార్డు

దుబాయ్‌: రెండు ట్రక్కులు ఢీకొట్టి ఎగసిపడిన మంటల నుంచి ట్రక్కు డ్రైవర్‌ను ఓ యువతి ప్రాణాలకు తెగించి కాపాడింది. యూఏఈలోని రాస్‌ అల్‌ ఖైమాహ్‌ నగరంలో సోమవారం జరిగిందీ ఘటన. భారత్‌కు చెందిన హర్‌కిరిత్‌ సింగ్‌ రోజూలాగే ట్రక్కులో వెళ్తుండగా మరో ట్రక్కు ఢీకొని మంటలు చెలరేగాయి. అందులో చిక్కుకున్న హర్‌కిరిత్‌ ఆర్తనాదాలు చేశాడు. స్నేహితురాలితో అటుగా కారులో వచ్చిన జవహర్‌ సైఫ్‌ అల్‌ కుమైతీ(22) వెంటనే స్పందించింది. స్నేహితురాలి వస్త్రాలను విప్పమని చెప్పి తనను కారులో ఉండాలని కోరింది. ఆ బట్టలతో మంటలను ఆర్పి అతడిని కాపాడింది. కాగా, జవహర్‌ ధైర్య సాహసాలను భారత రాయబారి నవదీప్‌సింగ్‌ సూరి కొనియాడారు. మరోవైపు ఆ యువతిని 'అభయ ఉమన్‌' అవార్డుతో సత్కరించనున్నట్లు దుబాయ్‌ అంబులెన్స్‌ అండ్‌ రెస్క్యూ సెక్షన్‌ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com